Former Chief Minister: ఆ వివాదాన్ని సీరియస్‌గా తీసుకోవాలి
ABN, First Publish Date - 2023-09-23T13:10:15+05:30
కావేరి జల వివాదాన్ని ప్రభుత్వం చాలా తేలిగ్గా పరిగణిస్తోందని బీజేపీ విరుచుకుపడింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai)
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జల వివాదాన్ని ప్రభుత్వం చాలా తేలిగ్గా పరిగణిస్తోందని బీజేపీ విరుచుకుపడింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) బెంగళూరు ఆర్‌టీ నగర్‌లోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సమస్య తలెత్తి నెలన్నర కావస్తున్నా పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకోకపోతే రైతులు, మఠాధిపతులు, ప్రజల ఆగ్రహం వెల్లువెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే అందుకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో నీటి గ్యారెంటీ పథకాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చునని ఎద్దేవా చేశారు. కావేరి వివాదాన్ని తాము రాజకీయం చేయడం లేదని, ప్రభుత్వానికి ఆయా సందర్భా ల్లో పూర్తి సహకారం అందించామన్నారు.
అంతకుముందు మల్లేశ్వరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బొమ్మైతోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కావేరి బేసిన్ జిల్లాలకు చెందిన బీజేపీ నేతల అభిప్రాయాలను ఆలకించారు. ఈ వివాదంపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కావేరి జల నిర్వహణా ప్రాధికార సమావేశాల్లోనూ, సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర వాదనను బలంగా వినిపించకపోవడం వల్లే పరిస్థితి చేయి దాటిందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే మరో 7.5 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తేది కాదన్నారు. మంత్రిమండలి సమావేశంలో రైతులకు నష్ట పరిహారం ప్రకటించాలని, సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసే అంశంపై కూడా నిర్ణయం తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-09-23T13:10:15+05:30 IST