Former Chief Minister: త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తా..

ABN, First Publish Date - 2023-02-11T12:43:39+05:30

బీజేపీ జాతీయ నాయకత్వం తన పట్ల ఎలాంటి వివక్ష చూపలేదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) తెలిపారు.

Former Chief Minister: త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచూరు(బెంగళూరు), ఫిబ్రవరి 10 : బీజేపీ జాతీయ నాయకత్వం తన పట్ల ఎలాంటి వివక్ష చూపలేదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం రాస్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి జిల్లాలోని సింధనూరుకు వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖరులతో కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌ బొమ్మై ప్రభుత్వం సమర్థవంతుడని చేస్తుందని కితాబు ఇచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలవడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో తాను విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేపడుతానన్నారు. ఎన్నికల సీట్ల కేటాయింపుకు సంబంధించి పార్టీ నిర్వహించిన సమీక్ష అనంతరం అభ్యర్థులను ప్రకకటిస్తామన్నారు. కాగా రాష్ట్ర బీజేపీలో ఎలాంటి భిన్నాభిప్రాయా లు లేవని అందరు ఒక్కతాటి పై ఉండి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని యడియూరప్ప స్పష్టం చేశారు. సింధనూ రు అభ్యర్థికి సంబంధించి పార్టీ నిర్ణయమే, పార్టీ సమీక్ష అనంతరం సరైన అభ్యర్థిని దింపుతుందన్నారు.

ఇదికూడా చదవండి: సెలబ్రిటీలు సంయమనంతో మెలగాలి

Updated Date - 2023-02-11T12:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising