ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. విభజించినవారే ‘జోడో యాత్ర’ చేయడం విడ్డూరం

ABN, First Publish Date - 2023-08-16T10:44:53+05:30

దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం అఖండ భారత్‌ను విభజించిన వారే ఇప్పుడు భారత్‌జోడో యాత్ర చేస్తుండడం విడ్డూరమని

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం అఖండ భారత్‌ను విభజించిన వారే ఇప్పుడు భారత్‌జోడో యాత్ర చేస్తుండడం విడ్డూరమని మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై(Former CM Basavaraj Bommai) పరోక్షంగా కాంగ్రెస్‏పై విరుచుకుపడ్డారు. బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం అంటే అందరూ ఇష్ట పడతారన్నారు. దేశాన్ని బ్రిటీష్ వారు, మహ్మదీయులు వందలాది సంవత్సరాలు పరిపాలించినా భారత సంస్కృతి సంప్రదాయాలను మాత్రం దెబ్బతీయలేకపోయారని పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర మనందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలోని అనేక ఘట్టాలు నేటి తరానికి పూర్తిగా తెలియపోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్రమోదీ పాలన మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం బురద చల్లుతున్నాయని ఆరోపించారు. ముస్లిం దేశాలతో పోలిస్తే భారత్‌లో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉన్నారన్నారు. రాజకీయ కారణాలతో ఎన్‌ఈపీ రద్దు చేయాలనే నిర్ణయం సరికాదని, దీనిపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అవినీతి, అక్రమాలపై మాట్లాడే నైతికత కాంగ్రెస్‏కు లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి కీలక నిర్ణయాలు మోదీ ధృడ సంకల్పం కారణంగానే సాధ్యమయ్యాయన్నారు. మాజీ మంత్రి గోవింద కారజోళ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-16T10:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising