Former CM: నిరూపించండి.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా...
ABN, First Publish Date - 2023-08-20T10:11:33+05:30
అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఎక్కడైనా చిన్నపాటి సాక్ష్యం ఉన్నా నిరూపిస్తే తమ కుటుంబమంతా పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతామని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఎక్కడైనా చిన్నపాటి సాక్ష్యం ఉన్నా నిరూపిస్తే తమ కుటుంబమంతా పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) ప్రకటించారు. శుక్రవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 శాతం కమీషన్ ఆరోపణలపై కమిషన్ ఏర్పాటు చేయడంపై తీవ్రంగా స్పందించారు. గాంధీనగర్, మల్లేశ్వరంలో జాబ్‌కోడ్‌పై మోహన్‌దా్‌స నివేదిక ఏమైందని ప్రశ్నించారు. 40 శాతం కమీషన్ ఆరోపణలను తొలుత వీరప్ప కమిషన్ వేస్తామని ప్రకటించారని, ప్రస్తుతం నాగమోహన్‌దా్‌సకు అప్పగించారన్నారు. నాగమోహన్దాస్తో ఏం రాయించుకున్నా ఉపయోగం ఉండదని, ఇదంతా కాలయాపన కోసమే అని మండిపడ్డారు. ‘నైస్’ నిర్మాణాలపై డీసీఎం డీకే శివకుమార్, ఎంపీ సురేశ్ చేసిన ఆరోపణలను ఖండించారు. తమ కుటుంబంలో ఎవరైనా నైస్ అక్రమాలలో పాల్గొన్నట్టు నిరూపిస్తే అందరూ రాజకీయాలు వదులుకుంటామన్నారు. దేవెగౌడ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అంటూ ప్రశ్నించారు. రెండు వేల ఎకరాలు ఎవరి పేరున బదిలీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ ప్రశ్నించారు. వ్యవహారాలు చేస్తున్నది మీరేనని, అది రాష్ట్ర ప్రజందరికీ తెలుసునని, తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని డీకే సురేశ్‌పై మండిపడ్డారు.
Updated Date - 2023-08-20T10:11:33+05:30 IST