కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ‘ఆపరేషన్‌ హస్త’ కోసం కుట్రలు.. గుంటనక్కల తరహాలో వేచి చూస్తున్నారు..

ABN, First Publish Date - 2023-11-07T13:46:49+05:30

రాష్ట్రంలో ఆపరేషన్‌ హస్త అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని గుంటనక్కల తరహాలో వేచి చూస్తున్నారని

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ‘ఆపరేషన్‌ హస్త’ కోసం కుట్రలు.. గుంటనక్కల తరహాలో వేచి చూస్తున్నారు..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆపరేషన్‌ హస్త అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, గుంటనక్కల తరహాలో వేచి చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి(Kumaraswamy) మండిపడ్డారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిన్నర్‌, బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లతో బిజీగా గడిపేందుకే సరి పోతోందని రాష్ట్ర ప్రజల కష్టాలు ఢిల్లీకు తీసుకుపోయేందుకు మీకు సమయ మెక్కడిదంటూ సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏవిధంగా రాష్ట్రాన్ని దోచేసి నగదు ఏవిధంగా సమకూర్చా లని బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌ మీటింగ్‌లలో రహస్యంగా పాఠాలు చెబుతున్నారా అంటూ మండిపడ్డారు. బీజేపీ, జేడీఎస్‌కు చెందిన సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు నిత్యం ప్రయత్నాలు సాగించడం లేదా...? అంటూ విరుచుకుపడ్డారు. మెడకు గ్యారెంటీ బోర్డు తగిలించుకుని వీధులలో తిరుగుతున్నారని కేవలం ఐదునెలలకే మీ ప్రభుత్వ బండారం వ్యతిరేకత బయట పడిందన్నారు. కుర్చీ కాపాడుకునేందుకు సిద్దరామయ్య ప్రయత్నాలు సాగించడం లేదా అంటూ నిలదీశారు. ప్రతిపక్షాలను గుర్తుంచుకున్న మీ హృదయ వైశాల్యాన్ని అభినందిస్తున్నానని కానీ ప్రభుత్వం తరుపున మీరేం చేస్తున్నా రనేది కూడా పరిశీలించుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేవేగౌడ కుటుంబానికి ఆత్మీయత ఉందనేది వాస్తవమని రాష్ట్రంలో మైత్రి ద్వారానే ముం దుకెళతామని ఇదే మీకు పెద్ద సంక్లిష్టంగా మారిందా అంటూ మండిపడ్డారు. ఇవే విషయాలను ‘ఎక్స్‌’లోను పోస్ట్‌ చేశారు

Updated Date - 2023-11-07T13:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising