ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: మాజీసీఎం సంచలన వ్యాఖ్యలు.. ఇది సారాయి గ్యారెంటీ ప్రభుత్వం..

ABN, First Publish Date - 2023-09-26T12:42:28+05:30

పంచాయతీలలోనూ మద్యం దుకాణాలను ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది.

- మాజీ సీఎం బొమ్మై ఎద్దేవా

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పంచాయతీలలోనూ మద్యం దుకాణాలను ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) ఈమేరకు సోమవారం ట్వీట్‌ చేస్తూ ఇది సారాయి గ్యారెంటీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా పంచాయతీలలో మద్యం దుకాణాలను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తలపెట్టడం సరికాదన్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించని సర్కార్‌ సారాయి దుకాణాలపై ఉత్సుకత చూపుతోందని విరుచుకుపడ్డారు. గ్యారెంటీ పేరిట మహిళలకు ప్రతినెల ఇస్తున్న రూ.2వేలను పురుషుల ద్వారా లాక్కునే ప్రయత్నాల్లో ఇది భాగమని విమర్శించారు. గ్రామ పంచాయతీలు ప్రశాంతంగా ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదేమోనని వ్యాఖ్యా నించారు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-26T12:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising