ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. కక్షసాధింపు, విద్వేష రాజకీయాలు మాకు తెలియవు..

ABN, First Publish Date - 2023-07-14T13:09:37+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభలో చేసిన వ్యాఖ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభలో చేసిన వ్యాఖ్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి శాసనసభలో సమాధానమిచ్చారు. కేంద్రంలోని దర్యాప్తు సంస్ధలను అడ్డుపెట్టుకుని ఎన్‌డీఏ ప్రభుత్వం తమ పార్టీఅగ్రనేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai) తిప్పికొట్టారు. కక్షసాధింపు , విద్వేష రాజకీయాలపై తమకు నమ్మకం లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) అవినీతిని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తుంటే కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలకు వెన్నులో వణుకు ప్రారంభమైందని బొమై ఎద్దేవా చేశారు. నిరుపేదల బియ్యాన్ని అడ్డుకున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిందలు మోపుతోందన్నారు. నిజానికి నిరుపేదలకోసం కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యంలోనూ కోతలు విధిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వీరి కడుపులు కొడుతోందన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరుపుతున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరుగలేదని ఎలాంటి దర్యాప్తును ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొమ్మై ప్రకటించారు. ఆపరేషన్‌ హస్త సిద్ధరామయ్య(Siddaramaiah) అవధి నుండే ప్రారంభమైందన్నారు. 2007లో మీరు జేడీఎస్‌ వీడి కాంగ్రెస్ లో చేరి గెలవలేదా? అని బొమ్మై సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. 1980 నుంచి కాంగ్రెస్‌ ఒకసారి అవధి పూర్తిచేసుకున్న తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి సమాధానంతో సంతృప్తిచెందని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - 2023-07-14T13:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising