ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: ఆ నిర్ణయం వెనుక అసలు విషయం ఇదేనట.. మాజీ సీఎం ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-09-12T11:40:22+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్టపాలనపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలన్నది ప్రజల అభిమతమని,

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్టపాలనపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలన్నది ప్రజల అభిమతమని, ఈ దిశలోనే జేడీఎస్‏కు స్నేహ హస్తం అందించామని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. హుబ్బళ్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు ప్రవహించే నీరులాంటివని, ఆయా సమయాలకు తగ్గట్లు పొత్తులు, అవగాహనలు సర్వసాధారణమని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు విషయమై జేడీఎస్‏లో ఎలాంటి అపశృతులు లేవని, ఒకవేళ ఒకటీ అరా ఉన్నా పార్టీ నేతలు వాటిని సరిదిద్దుతారని తెలిపారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని బొమ్మై అన్నారు. సిద్దూ పాలన దిక్కూ దిశా లేకుండా కేవలం వేధింపులు, కక్షసాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ, జేడీఎస్‌ ఇకపై ఉమ్మడిగా పో రాటం చేస్తాయని, ఉభ య పార్టీల నేతలు కలిసి ఇందుకు సం బంధించిన వ్యూహాలను సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.

Updated Date - 2023-09-12T11:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising