ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. మీకు దమ్ముంటే అంటూ...

ABN, First Publish Date - 2023-07-21T12:43:19+05:30

ప్రొటోకాల్‌ దుర్వినియోగం విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే దళితకార్డును కాంగ్రెస్‌ తెరపైకి తెచ్చిందని జేడీఎస్‌ నేత, మాజీ సీ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రొటోకాల్‌ దుర్వినియోగం విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే దళితకార్డును కాంగ్రెస్‌ తెరపైకి తెచ్చిందని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డి.కుమారస్వామి(Former CM HD Kumaraswamy) ఆరోపించారు. సచివాలయంలోని తన కార్యాయంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుడైన డిప్యూటీ స్పీకర్‌ రుద్రప్ప లమాణిపై కాగితాలు విసిరినందునే శాసనసభలో 10 మంది బీజేపీ సభ్యులను సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రొటోకాల్‌ దుర్వినియోగం వ్యవహారంపై ప్రభుత్వం తప్పించుకోజాలదన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌ దళిత ప్రేమ బూటకమని నిజంగానే మీకు దళితులపై ప్రేమ ఉంటే తక్షణం రాజీనామా చేసి దళితుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన సిద్ధరామయ్య(Siddaramaiah)కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇక చూస్తూ ఊరుకునేదిలేదని ప్రజాక్షేత్రంలో బీజేపితో కలిసి పోరాడాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా తీర్మానించారన్నారు. గవర్నర్‌ భేటీకి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జిటి.దేవెగౌడ, వెంకటశివారెడ్డిలను వెంట తీసుకెళ్ళడం విశేషం.

Updated Date - 2023-07-21T12:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising