ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay: బొగ్గు స్కాంలో మాజీ ఎంపీ విజయ్‌కు నాలుగేళ్ల జైలు

ABN, First Publish Date - 2023-07-27T01:42:00+05:30

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్‌ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్‌ దర్దా, వ్యాపారవేత్త మనోజ్‌కుమార్‌ జైస్వాల్‌(Manoj Kumar Jaiswal)కు ఢిల్లీ కోర్టు(Court of Delhi) బుధవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

న్యూఢిల్లీ, జూలై 26: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్‌ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్‌ దర్దా, వ్యాపారవేత్త మనోజ్‌కుమార్‌ జైస్వాల్‌(Manoj Kumar Jaiswal)కు ఢిల్లీ కోర్టు(Court of Delhi) బుధవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే బొగ్గు శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మాజీ ప్రభుత్వ అధికారులు కేఎస్‌ క్రోఫా, కేసీ సమ్రియాకు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్‌ బన్సాల్‌ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే వీరు ముగ్గురు హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. ఇటు కేసులో దోషిగా తేలిన జేఎల్‌డీ యావత్మాల్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. బొగ్గు కుంభకోణంలో పదమూడో నేరారోపణకు సంబంధించిన కేసు ఇది.. నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ స్కాంకు సంబంధించి ఈనెల 13న కోర్టు మొత్తం ఏడుగురిని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-27T01:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising