Former Prime Minister: హాసన్ నుంచి మరోసారి మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ..?
ABN, First Publish Date - 2023-08-20T09:59:21+05:30
సుదీర్ఘ కాలం హాసన్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందుతూ వచ్చిన మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) మరోసారి అక్కడి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కాలం హాసన్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందుతూ వచ్చిన మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేవెగౌడ మరోసారి పోటీ చేస్తారనే అంశం వారం పదిరోజులుగా జేడీఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ స్థానాన్ని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు అప్పగించి సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతో తుమకూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న దేవెగౌడ లోక్‌సభకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. మైసూరు, మండ్య, హాసన్ జిల్లాల్లో ఒక్కలిగ సామాజికవర్గం అధికంగా ఉండడంతోపాటు అనాదిగా జేడీఎస్ పార్టీకి బలం ఉంది. ఇటీవల రాజకీయ పరిణామాలతో మైసూరు, మండ్య(Mysore, Mandya) జిల్లాల్లోనూ కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. దేవెగౌడ పోటీకి సిద్ధమైతే ప్రజ్వల్ వెనుకడుగు వేయక తప్పదు. ఇటీవలే కుమారస్వామి తమ కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరని తేల్చి చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ అధ్యక్షతన పార్టీ కోర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో దేవెగౌడ కుటుంబానికి చెందినవారు ఎవరూ లేరు. ఇలా కుటుంబ పార్టీ ముద్రనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2023-08-20T09:59:21+05:30 IST