Former Prime Minister: ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని.. ఏమైందో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-03-02T11:41:54+05:30
మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి(Manipal Hospital)లో చేరారు. గత కొన్నిరోజులుగా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి(Manipal Hospital)లో చేరారు. గత కొన్నిరోజులుగా దేవెగౌడకు కాళ్ల వాపులు, మోకాలి నొప్పులు ఉన్నమేరకు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన అల్లుడు, జయదేవ కార్డియాలజీ ఆసుపత్రి డైరెక్టర్ సీఎన్ మంజునాథ్ తెలిపారు. దేవెగౌడ ఆసుపత్రిలో చేరిన విషయమై సాగుతున్న ప్రచారాలపై ఆయన స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడు తూ దేవెగౌడ ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వయోసహజ ఆరోగ్య సమస్యలు మి నహా ఇతరత్రా ఎటువంటి చికిత్సలు అవసరం లేదన్నారు. కాళ్ల నొప్పులు కొంతకాలంగా ఉన్నాయని అదే కారణంతోనే కాళ్ల వాపులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం డయాబెటిస్, బీపీ వంటి జబ్బులకు చికిత్సలు కొనసాగుతున్నాయని, కాళ్ల నొప్పులకు సాధారణ వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. మంగళవారం సాయంత్రం మణిపాల్ ఆ సుపత్రికి తరలించామని పరీక్షలు జరిపిన వైద్యులు వారం రోజుల విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారని తెలిపారు.
Updated Date - 2023-03-02T11:41:54+05:30 IST