ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi in Varanasi: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-09-23T12:08:10+05:30

ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేడు వారణాసి(Varanasi)లో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియాని(International Cricket Stadium)కి శంకుస్థాపన చేయనున్నారు.

లఖ్ నవూ: ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేడు వారణాసి(Varanasi)లో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియాని(International Cricket Stadium)కి శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) రాష్ట్ర మంత్రులు అంతా పాల్గొననున్నారు. యోగీ సర్కార్ స్డేడియానికి భూసేకరణ కోసం రూ.121 కోట్లు కేటాయించింది. దీని నిర్మాణానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) రూ.330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. టెండూల్కర్, గవాస్కర్, శాస్త్రి, వెంగ్‌సర్కార్ వంటి ప్రముఖ క్రికెటర్లు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు.


శంకుస్థాపన కార్యక్రమానికి BCCI ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా సహా కీలక వ్యక్తులు కూడా పాల్గొంటారు. కాన్ పుర్, లఖ్ నవూలో ఉన్న స్డేడియాలతో పోల్చితే ఇదే రాష్ట్రంలోనే మూడో అతి పెద్దది కానుంది. ఈ ప్రోగ్రాం అనంతరం ప్రధాని రూ.1 వెయ్యి 115 కోట్లతో నిర్మించిన 16 అటల్ రెసిడెన్షియల్ బడులను(Residential Schools) ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ పర్యటనకు ముందే ఢిల్లీ(Delhi)లోని విజ్ఞాన్ భవన్‌లో 'అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు 2023'ని మోదీ ప్రారంభించారు.

Updated Date - 2023-09-23T12:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising