ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి నాలుగో ఫ్లైట్‌లో ఢిల్లీకి 274 మంది భారతీయులు

ABN, First Publish Date - 2023-10-15T18:54:10+05:30

'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్‌లో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు.

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్‌లో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాలను వారికి అందజేశారు. ఇజ్రాయెల్‌లో పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులను మరిన్ని విమానాల్లో వెనక్కి తీసుకు రానున్నట్టు వీకే సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.


''ఇది నాలుగో విమానం. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులు కూడా అందుబాటులోకి తెస్తాం. విమానాలకు ఏదైనా తాకే అవకాశాలు ఉండవచ్చనే ఆందోళన కూడా ఉంది. అయితే, ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్‌లో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయినప్పటికీ యూనివర్శిటీలు మూసేశారు. భయాలతో కూడిన వాతావరణం అయితే కొనసాగుతోంది. అనవసర ఇబ్బందులు ఎందుకని భావిస్తున్న కొందరు భారతీయులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు చక్కబడగానే తిరిగి అక్కడికి వెళ్తారు'' అని వీకే సింగ్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే ఆదేశాలను పాటించాలని సూచించారు. సోమవారం మరో విమానం ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి వస్తుందని చెప్పారు. ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో వారందరినీ వెనక్కి తెచ్చేంతవరకూ విమానాలను నడుపుతామని తెలిపారు. ఆపరేషన్ అజయ్ విజయవంతంగా, సమర్ధవంతంగా నడుస్తోందని చెప్పారు. కాగా, ఇజ్రాయెల్‌లో ఇంకా ఉద్రిక్తతలు సమసిపోలేదని, ఆపరేషన్ అజయ్ కింద భారతీయ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువస్తున్న మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలని స్వదేశానికి తిరిగి వచ్చిన పలువురు ప్రయాణికులు తెలిపారు. ఈసారి వెనక్కి తిరిగి వచ్చిన వారిలో పలువురు ఉత్తరాఖండ్‌ వాసులు కూడా ఉన్నారు.

Updated Date - 2023-10-15T19:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising