Karnataka Elections: ఇవి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావు.. కుమారస్వామి సంచలన కామెంట్..!
ABN, First Publish Date - 2023-05-10T17:55:47+05:30
బెంగళూరు: ''ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి'' అని జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: ''ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి'' అని జనతాదళ్ సెక్యులర్ (JDS) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి (HD Kumaraswamy) అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇచ్చిన మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కింగ్‌గా నిలుస్తుందా? కింగ్ మేకర్‌గా నిలుస్తుందా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిస్తూ, ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అయితే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదని, డబ్బులు లేకుండా ఎవరూ ఎన్నికలను ఎదుర్కోలేరని అన్నారు.
''జాతీయ పార్టీలు చెబుతున్న దానికంటే ఎక్కువ సీట్లు మా పార్టీ కర్ణాటకలో సాధిస్తుంది. పీఎఫ్ఐ, బజరంగ్ దల్ వంటి అంశాలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపించవు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఓట్ల లబ్ది కోసమే అలాంటి అంశాలు లేవనెత్తున్నారు'' అని కుమారస్వామి చెప్పారు.
చన్నపట్న నుంచి కుమారస్వామి పోటీ
కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసిన హెచ్‌డీ కుమారస్వామి ఈ ఎన్నికల్లో రామనగర జిల్లా చన్నపట్న నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై బీజేపీ నేత సీపీ యోగేశ్వర పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఆ ప్రాతంలో బలమైన వొక్కలిక సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018లో చన్నపట్న నియోజకవర్గం నుంచి కుమారస్వామి ఎన్నికల బరిలోకి దిగడానికి ముందు వరకూ ఆ నియోజకవర్గం యోగేశ్వరకు పెట్టనికోటగా ఉంది. 1999 నుంచి ఇదే సెగ్మెంట్ నుంచి ఐదుసార్లు యోగేశ్వర గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి కూడా పోటీ చేసి ఆయన గెలిచారు.
Updated Date - 2023-05-10T17:58:30+05:30 IST