French fashion : ఫ్యాషన్ ప్రపంచంలో ఎదురులేని సంచలనం... గ్రహాంతర శిలలతో బ్యాగుల తయారీ...
ABN, First Publish Date - 2023-03-25T20:03:10+05:30
ప్రతి క్షణం సరికొత్తగా కనిపించి, అందరినీ ఆకట్టుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు కోపెర్ని (Coperni) అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్
న్యూఢిల్లీ : ప్రతి క్షణం సరికొత్తగా కనిపించి, అందరినీ ఆకట్టుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు కోపెర్ని (Coperni) అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ఫ్యాషన్ ప్రపంచం అవాక్కయ్యేలా చేసింది. ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త కోణాన్ని పరిచయం చేసింది. గ్రహాంతర శిలలతో బ్యాగులను తయారు చేసింది. పారిస్ ఫ్యాషన్ వీక్ 2023లో మోడల్స్‌తోపాటు రోబోల చేత ర్యాంప్ వాక్ చేయించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా కోపెర్ని ఎవరికీ రాని ఆలోచనతో దూసుకెళ్తోంది. పూర్తిగా out-of-the-box ఆలోచనతో ఓ హ్యాండ్ బ్యాగ్‌ను తయారు చేసింది. ఈ సంస్థ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రత్యేకంగా సేకరించిన గ్రహాంతర శిలతో దీనిని తయారు చేసింది. ముందుగా ఆర్డర్ ఇచ్చినవారికి ప్రత్యేకంగా స్పేస్ రాక్‌ను సేకరించి, హ్యాండ్ బ్యాగ్‌ను తయారు చేసి, అందజేస్తుంది. ఇది చూడటానికి డార్క్ గ్రే కలర్‌లో, చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. అయితే దీని మీద కోపెర్ని ఎంబోస్డ్ లోగో ముద్రించి ఉంటుంది.
ప్రతి ఆర్డర్‌కు ఓ గ్రహాంతర శిలను సేకరిస్తామని ఈ సంస్థ చెప్తోంది. గ్రహాంతర శిల భూమిపై పడే చోటునుబట్టి వివిధ ప్రదేశాల నుంచి వీటిని సేకరిస్తామని చెప్తోంది. ఈ బ్యాగులను చేతితోనే తయారు చేయనున్నట్లు తెలిపింది. Italian factory Semar దీనిని బ్యాగు రూపంలోకి తీర్చిదిద్దుతుందని చెప్పింది.
ఈ విచిత్రమైన బ్యాగు ఖరీదు 40,000 యూరోలు (సుమారు రూ.35 లక్షలు) అని, దీని కోసం ఆర్డర్ ఇచ్చినవారికి, ఆర్డర్ ఇచ్చిననాటి నుంచి సుమారు ఆరు వారాల్లోగా చేరుతుందని తెలిపింది. ఒకసారి పంపిన బ్యాగును తిరిగి తీసుకోబోమని చెప్పింది.
సెబాస్టియన్ మేయర్, ఆర్నాడ్ వైల్లంట్ 2018లో కోపెర్నిని రీలాంచ్ చేశారు. సూపర్ మోడల్ బెల్లా హడిడ్‌పై మొత్తం డ్రస్‌ను స్ప్రే పెయింట్ చేసి, ఫ్యాషన్ వరల్డ్‌ను కట్టిపడేసింది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..
Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ
Updated Date - 2023-03-25T20:03:10+05:30 IST