ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur : మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస

ABN, First Publish Date - 2023-07-27T15:29:01+05:30

మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్‌ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు.

న్యూఢిల్లీ : మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్‌ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు. ఘర్షణ జరిగిన చోటుకు సమీపంలోని గ్రామస్థులు హుటాహుటిన వేరొక చోటుకు పరుగులు తీసి, ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు.

స్థానికులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బుధవారం రాత్రి నుంచి ఈ గ్రామంలో హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయని, తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. తాము రాత్రంతా నిద్రపోలేదని, ఏమీ తినలేదని తెలిపారు. ఎడతెగకుండా కాల్పుల శబ్దాలు వినిపిస్తుండటంతో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని చెప్పారు.

భద్రతా దళాలు ప్రయాణించేందుకు ఉపయోగించే రెండు బస్సులను మణిపూర్‌లోని కంగ్పోక్పిలో కొందరు దుండగులు బుధవారం తగులబెట్టారు. దిమాపూర్ నుంచి వస్తుండగా వీటిని మంగళవారం రాత్రి సపోర్మీనా వద్ద తగులబెట్టారు.


ఎస్టీ వర్గంలో చేర్చాలన్న డిమాండ్‌పై రగడ

మెయిటీ తెగవారిని షెడ్యూల్డు తెగల కేటగిరీలో చేర్చడంపై పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మే 3 నుంచి మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మెయిటీలు ఉంటారు, కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు. వీరు రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగంలో ఉంటారు. మెయిటీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం కాగా, కుకీలు, నాగాలు కలిపి 40 శాతం వరకు ఉంటారు.

మోదీ మాట్లాడాలి : ప్రతిపక్షాలు

తగులబడుతున్న మణిపూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్షాల కూటమి ఇండియా డిమాండ్ చేస్తోంది. చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెప్తోంది. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సయోధ్య కుదరడం లేదు. సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి.


ఇవి కూడా చదవండి :

No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

Updated Date - 2023-07-27T15:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising