ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gali Janardhan Reddy: గాలి జనార్దనరెడ్డిని ఈ మైనింగ్ వ్యాపారి అంత మాట అనేశారేంటి..?

ABN, First Publish Date - 2023-02-15T12:05:13+05:30

గాలి జనార్దనరెడ్డి వైట్‌ కాలర్‌ దొంగ.. సరిహద్దును ఆక్రమించి లక్ష టన్నుల ఇనుప ఖనిజ సంపదను కొల్లగొట్టారు. ఇప్పుడు కళ్యాణ కర్ణాటక అభివృద్ది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర సరిహద్దులను మింగేశాడు: టపాల్‌ గణేశ్‌

బళ్లారి(బెంగళూరు), ఫిబ్రవరి 14: గాలి జనార్దనరెడ్డి వైట్‌ కాలర్‌ దొంగ.. సరిహద్దును ఆక్రమించి లక్ష టన్నుల ఇనుప ఖనిజ సంపదను కొల్లగొట్టారు. ఇప్పుడు కళ్యాణ కర్ణాటక అభివృద్ది పార్టీ ద్వారా మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలు నమ్మవద్దని మైనింగ్‌ వ్యాపారి టపాల్‌ గణేశ్‌(Tapal Ganesh) వెల్లడించారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రాలో మైనింగ్‌ అను మతి తీసుకుని రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సండూర్‌ తాలూకా తుమటి ప్రాం తం వరకు గనుల తవ్వకాలు జరిపా రన్నారు. దోచుకున్న సంపదతో ఎన్నికల్లో అధికారలంకి రావాలని చూస్తున్నారన్నారు. టన్నుల కొద్దీ ఇనుప ఖనిజం చోరీకి సంబంధించి సీబీఐ ఇప్పటికే ఛార్జీషీటు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సరిహద్దులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఏమాత్రం చర్యలు చూపడం లేదన్నారు. ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తోందని ఆరోపించారు. సీబీఐ నివేదికలో ఏముందో మన ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనార్దనరెడ్డి(Janardana Reddy) మైనింగ్‌ 20 ఎకరాల ఆక్రమణకు గురైందని అప్పట్లో మైనింగ్‌ సర్వేయర్‌గా ఉన్న ధరప్ప నాయక్‌ నివేదిక ఇచ్చారు. సరిహద్దు ఆక్రమణకు పాల్పడ్డారని సీబీఐ విచారణ కేసులో సాక్షిగా ఉన్నాడు. అలాంటి ధరప్ప నేడు కేఆర్‌పీపీలో ఉండడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇదికూడా చదవండి: ప్రభాకరన్‌ బతికే ఉన్నాడన్న ఈ పెద్దాయన పరిస్థితి ఇప్పుడేంటంటే..

Updated Date - 2023-02-15T12:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising