ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gali Janardhana Reddy: ‘గాలి’ వినతిని ప్రభుత్వం పరిష్కరించేనా...

ABN, First Publish Date - 2023-07-13T12:55:10+05:30

బళ్ళారి విమానాశ్రయం(Bellary Airport) ప్రారంభమయ్యేలోపు పర్యాటకుల సౌకర్యార్థం హంపి-ఆనెగొందిల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- హంపి-ఆనెగొంది మార్గంలో గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మించాలి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బళ్ళారి విమానాశ్రయం(Bellary Airport) ప్రారంభమయ్యేలోపు పర్యాటకుల సౌకర్యార్థం హంపి-ఆనెగొందిల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gali Janardhana Reddy) విజ్ఞప్తి చేశారు. శాసనసభలో బుధవారం ఆయన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై ప్రసంగించారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలుచేకూరేలా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలకు తన మద్దతు ప్రకటించారు. గ్యారెంటీ పథకాలను అత్యధికులు లబ్ధి పొందేలా నిబంధనలను సడలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయోధ్య తరహాలో ఆంజనాద్రి కొండల ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. గత బీజేపీ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు గాను అంజనాద్రి ప్రాంతం అభివృద్ధికి రూ.120 కోట్లు కేటాయిం చినా ఒక్కపైసా కూడా విదిల్చలేదన్నారు. అంజనాద్రిని నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రజల ఆశల్ని వమ్ముచేశారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు దేశవిదేశాల నుంచి విచ్చేస్తున్నారని మౌలిక సదుపాయాలతో పాటు వసతి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బళ్ళారి విమానాశ్రయ నిర్మాణం కోసం ఇప్పటికే 900 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్న ఆయన పిపిపి మోడల్‌లో హంపి-ఆనెగొందిల మధ్య గ్రీన్‌ ఫీల్డ్‌ రహ దారిని కూడా నిర్మిస్తే కేవలం 45 నిముషాల్లోనే పర్యాటకులు ఎయిర్‌పోర్టు నుంచి హంపికి చేరుకునే వెసలుబాటు లభిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించకుండా ఉంటే కల్యాణ కర్ణాటక ప్రాంతంలో తమ పార్టీ కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి ఉండేదని గాలి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో రాజకీయం చేయబోనని ప్రభుత్వానికి నిర్మాణాత్మక మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో గాలి జనార్ధనరెడ్డి ప్రసంగాన్ని సభ్యులంతా ఆసక్తిగా ఆలకించడం విశేషం.

Updated Date - 2023-07-13T12:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising