ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gandhi Peace Prize: గీతాప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం

ABN, First Publish Date - 2023-06-18T20:44:11+05:30

జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్‌ను ఎంపిక చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని (Gandhi Peace Prize)ని కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్ (Gita Press)ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్ ప్రచురణ సంస్థను ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతికి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని జ్యూరీ ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్టు చెప్పింది. జాతి, కుల, మత, లింగ బేధం లేకుండా గాంధీజా బాటలో శాంతియుత మార్గంలో నవప్రపంచ నిర్మాణానికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఈ ప్రైజ్‌ను ఏటా అందిస్తుంటారు. ఈ పురస్కారం కింద రూ.కోటి నగదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు.

మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కరాన్ని ఇస్రో, రామకృష్ణ మిషన్, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్, వివేకానంద కేంద్రం-కన్యాకుమారి, అక్షయ పాత్ర-బెంగళూరు, ఏక్తా అభియాన్ ట్రస్టు-ఇండియా, సులభ్ ఇంటర్నేషనల్-న్యూఢిల్లీ అందుకున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు డాక్టర్ నెల్సన్ మండేలా, టాంజానియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జిలియస్ నైరేరే, సర్వోదయ శ్రమదాన్ ఉద్యమం వ్యవస్థాపకుడు డాక్టర్ ఏటీ అరియరత్నె తదితర ప్రముఖలు సైతం అందుకున్నారు. 2019లో ఒమన్ సుల్తాన్ దివంగత ఖబూస్ బిన్ సైద్, 2020లో దివంగత బంగబంధు షేక్ ముజబుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)‌కు ఈ అవార్డులను ప్రకటించారు.

గీతాప్రెస్ ఆవిర్భావం

ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిషర్లలో ఒకటైన గీతా ప్రెస్ 1923లో ప్రారంభమైంది. 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల ప్రతులు భగవద్గీతపైనే ఉండటం విశేషం. గీతాప్రెస్ ఏనాడూ ఆదాయం కోసం తమ ప్రచురణల్లో అడ్వర్‌టైజ్‌మెంట్లపై ఆధార పడలేదు. అనుబంధ సంస్థలతో కలిసి మానవ జీవన ప్రమాణాలు, సమాజ శ్రేయస్సుకు ఉద్దేశించి ప్రచురణలు సాగించిన ఘనత సాధించింది.

ప్రధాని అభినందనలు

గాంధీ శాంతి పురస్కరానికి ఎంపికైన గీతాప్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ప్రజల్లో సామాజిక, సంస్కృతిక పరివర్తన కోసం వందేళ్లుగా గీతాప్రెస్ చేస్తున్న కృషి శ్లాఘనీయమని ప్రశంసించారు.

Updated Date - 2023-06-18T20:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising