ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union minister Giriraj Singh: ముస్లింలందరినీ పాక్‌కు పంపించాల్సింది... కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-23T07:47:58+05:30

బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధించాలన్న ప్రముఖ ముస్లిం పండితుడు మౌలానా అర్షద్ మదానీ డిమాండ్‌పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు....

Union minister Giriraj Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధించాలన్న ప్రముఖ ముస్లిం పండితుడు మౌలానా అర్షద్ మదానీ డిమాండ్‌పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు.(Giriraj Singh)మౌలానా అర్షద్ మదానీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన బజరంగ్ దళ్‌పై నిషేధం విధించే(Bajrang Dal ban) వాగ్దానాన్ని సమర్థించారు.మదానీ ప్రసంగంపై స్పందించిన బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు గిరిరాజ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ విభజన సమయంలోనే ముస్లింలందరినీ పాకిస్తాన్‌కు పంపించి ఉండాల్సింది’’ అని(Should have been sent to Pakistan) గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.బీహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఇది కూడా చదవండి : RRR actor: ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు కన్నుమూత

బజరంగ్ దళ్‌ను ఇస్లామిస్ట్ పిఎఫ్‌ఐ వంటి టెర్రరిస్ట్ సంస్థతో పోల్చినందుకు బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మత సామరస్యానికి భంగం కలిగించిన భజరంగ్ దళ్, పిఎఫ్‌ఐలపై అవసరమైతే నిషేధం సహా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.‘‘గిరిరాజ్ సింగ్ బీజేపీలో ఎల్లప్పుడూ అఖండ భారత్ అని ప్రమాణం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ప్రేరణ పొందారు. ఇప్పుడు ముస్లింలందరినీ పాకిస్తాన్‌కు పంపాలని వాదించడం ద్వారా కేంద్ర మంత్రి అఖండ భారత్ భావనను తిరస్కరించాలని చూస్తున్నారు’’ అని జెడి(యు) ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ అన్నారు.

Updated Date - 2023-05-23T07:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising