ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bomb Threat : ఢిల్లీ-పుణే విమానానికి బాంబు బెదిరింపు.. కొనసాగుతున్న తనిఖీలు..

ABN, First Publish Date - 2023-08-18T11:57:38+05:30

దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని పుణేకు వెళ్లవలసిన విస్తారా విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అధికారులు తక్షణం అప్రమత్తమయ్యారు. విమానం నుంచి ప్రయాణికులను, వారి లగేజ్‌ను హుటాహుటిన సురక్షితంగా దించేసి, ఆ విమానాన్ని ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి, తనిఖీలు జరుపుతున్నారు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని పుణేకు వెళ్లవలసిన విస్తారా విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అధికారులు తక్షణం అప్రమత్తమయ్యారు. విమానం నుంచి ప్రయాణికులను, వారి లగేజ్‌ను హుటాహుటిన సురక్షితంగా దించేసి, ఆ విమానాన్ని ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి, తనిఖీలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో పరిస్థితి సాధారణంగా ఉంది.

ఈ బెదిరింపు ఫోన్ కాల్ జీఎంఆర్ కాల్ సెంటర్‌కు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు. విమానం నుంచి సురక్షితంగా దిగినందుకు ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ వార్త రాసే సమయానికి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.


ఇవి కూడా చదవండి :

Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..

Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..

Updated Date - 2023-08-18T11:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising