ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

August 15: టమోటా ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కిలో టమోటా..

ABN, First Publish Date - 2023-08-14T19:04:39+05:30

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. కిలో టమోటా ధరను 50 రూపాయల రిటైల్ ధరగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

న్యూఢిల్లీ: ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇటీవల కొండెక్కి కూర్చున్న టమోటా ధరలను అదుపులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కిలో టమోటా ధరను 50 రూపాయల రిటైల్ ధరగా అమ్మాలని నేషనల్ కో-ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్‌కు (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో.. దేశవ్యాప్తంగా ఆగస్ట్ 15 నుంచి కిలో టమోటా 50 రూపాయలకు, అంతకంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. అయితే.. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయక ముందే టమోటా ధరలు దిగొచ్చాయి. ఎన్నడూలేనంత ధరతో చుక్కలు చూపించిన టమాట రెండు రోజులుగా దిగొస్తోంది. నిన్న మొన్నటి వరకు పలు ప్రాంతాలను బట్టి కిలో రూ.150 నుంచి రూ200 వరకు పలకగా టమాటా కంటే కేజీ చికెన్‌ కొనుక్కోవడం నయం కదా అనుకున్నారు. అంతేకాదు అమ్మో టమాటా అంటూ నోరెళ్లబెట్టారు.


అంతలా భారీ ధరతో గుండెదడ సాధారణ, మధ్య తరగతి వారిని దడదడలాడించిన టమాటా ధర క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో రూ.58నుంచి రూ.60వరకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఏపీలోని మదనపల్లె, అనంతపురంతో పాటు కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పండుతున్న టమాటా అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం రూ.50కి చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఏదేమైనా సుమారు రెండు నెలలుగా ఊహించని ధరతో ఠారెత్తించిన టమాటా ధరలు తగ్గుతుండటంతో జనం కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.

Updated Date - 2023-08-14T19:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising