Governor: వీసీలకు గవర్నర్ లేఖ.. ఆ కళాశాలల్లో రాష్ట్ర సిలబస్ అమలు చేయొద్దు
ABN, First Publish Date - 2023-08-23T08:48:44+05:30
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో రాష్ట్రప్రభుత్వ పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని గవర్నర్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో రాష్ట్రప్రభుత్వ పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆయన మంగళవారం లేఖ రాశారు. ఇటీవల తనను కలుసుకున్న వైస్‌ఛాన్సలర్లు, విద్యావేత్తలు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన పాఠ్యాంశాలను అమలు చేయాలంటూ తమపై ఒత్తిళ్లు పెరిగాయని తన వద్ద మొరపెట్టుకున్నారని గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర సిలబస్(State Syllabus)ను అమలు చేస్తే విద్యా ప్రమాణాలు క్షీణిస్తాయని, అఖిల భారత స్థాయిలో పోటీ పరీక్షల్లో విద్యార్థులు వెనుకబడిపోతారని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు యూజీసీకి కట్టుబడే పని చేస్తాయని, ఆ సిఫారసు చేసే కేంద్ర విద్యావిధానానికి సంబంధించిన సిలబస్‌నే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అమలు చేయాలని గవర్నర్ ఆ లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఉన్నతవిద్యా శాఖ ప్రతిపాదించే సిలబస్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Updated Date - 2023-08-23T08:48:44+05:30 IST