ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gujarat Bjp: గుజరాత్ బీజేపీకి కీలక నేత షాక్..!

ABN, First Publish Date - 2023-08-05T14:41:10+05:30

కీలకమైన లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో గుజరాత్‌ బీజేపీకి ఆ పార్టీ కీలక నేత షాక్ ఇచ్చారు. బీజేపీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పదవికి ప్రదీష్‌సిన్హ్ వాఘేలా శనివారంనాడు రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ: కీలకమైన లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections) వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో గుజరాత్‌ బీజేపీ (Gujarat Bjp)కి ఆ పార్టీ కీలక నేత షాక్ ఇచ్చారు. బీజేపీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పదవికి ప్రదీష్‌సిన్హ్ వాఘేలా (Pradipsinh Vaghela) శనివారంనాడు రాజీనామా చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. అయితే ఇందుకు ఇతమిద్ధమైన కారణం ఏమిటనేది ఆయన చెప్పలేదు. మరికొన్ని రోజుల్లో అంతా చక్కబడుతుందని చెప్పారు. 2016 ఆగస్టులో వాఘేలాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీజేపీ నియమించింది. భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు.


లోక్‌సభ ఎన్నికలను దృష్టిలోఉంచుకుని గుజరాత్ బీజేపీ ఇటీవల ప్రజలను నేరుగా కలుసుకునేందుకు 'మహా జన్ సంపర్క్ అభియాన్' అనే కార్యక్రమాన్ని కూడా చెపట్టింది. మేథాలు, వాణిజ్య వర్గాలతో వివిధ సదస్సులు కూడా నిర్వహించింది. 26 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు సైతం నిర్వహించింది.

Updated Date - 2023-08-05T14:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising