Gujarat:కెమికల్ ఇంజినీర్ దగ్గర రూ.500 కోట్ల డ్రగ్స్ ముడి సరకు.. అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు
ABN, First Publish Date - 2023-10-23T13:21:46+05:30
ఓ కెమికల్ ఇంజినీర్(Chemical Engineer) వద్ద రూ.500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరకులు బయటపడటం గుజరాత్(Gujarat)లో సంచలనం సృష్టిస్తోంది.
గాంధీనగర్: ఓ కెమికల్ ఇంజినీర్(Chemical Engineer) వద్ద రూ.500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరకులు బయటపడటం గుజరాత్(Gujarat)లో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన జితేష్ హిన్హోరియా గుజరాత్ లోని సూరత్ లో(Surat) నివసిస్తున్నాడు. ఇతను మాజీ ఫార్మా ఉద్యోగి. ప్రస్తుతం కెమికల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాడు. జితేష్ కెటామైన్, మెఫెడ్రోన్, కొకైన్ లను ఉపయోగించి డ్రగ్స్ తయారు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది.
రంగంలోకి దిగిన పోలీసులు అతని నివాసంపై దాడులు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్(Drugs) తయారు చేయడానికి అతని వద్ద 23 వేల లీటర్ల ముడిసరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాని విలువ అక్షరాల రూ.500 కోట్లని వారు ప్రాథమికంగా అంచనా వేశారు. ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు విషయాలు రాబట్టారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ తయారు చేసి భారత్ లోని వివిధ నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఓ ఇండస్ట్రీ వీరికి సరకు సప్లై చేస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన వాటిలో 14 కిలోల మెఫెడ్రోన్, 4.3 కిలోల కెటామైన్ ఉన్నాయి. "శంభాజీనగర్ కు చెందిన నిందితుడు సూరత్‌లో మాదక ద్రవ్యాల రాకెట్‌ను నడుపుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. DRI అహ్మదాబాద్ జోనల్ యూనిట్, క్రైమ్ బ్రాంచ్, అహ్మదాబాద్ పోలీసుల నిఘాతో నిందితుడిని పట్టుకున్నాం. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం ”అని ఓ గుజరాత్ పోలీస్ అధికారి తెలిపారు. మరో ఇద్దరు నిందితుల నివాసాల్లో సోదాలు చేయగా వారి వద్ద 23 కిలోల కొకైన్, 2.9 కిలోల మెఫెడ్రోన్, రూ. 30 లక్షల నగదు స్వాధీనం లభ్యమైందన్నారు. జితేష్ రెండేళ్లుగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడు. ముంబయిలో కొకైన్, రత్లాం, ఇండోర్, ఢిల్లీ, చెన్నై, సూరత్ లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేసేవాడని దర్యాప్తులో తేలింది.
Updated Date - 2023-10-23T13:27:04+05:30 IST