Guruvayoor Express: గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
ABN, First Publish Date - 2023-04-11T10:54:10+05:30
రైల్వే లైన్‌లో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఎగ్మూరు - గురువాయూర్ ఎక్స్‌ప్రెస్(Egmuru - Guruvayur Express)ను దారి మళ్లించినట్లు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రైల్వే లైన్‌లో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఎగ్మూరు - గురువాయూర్ ఎక్స్‌ప్రెస్(Egmuru - Guruvayur Express)ను దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. మంగళవారం రాత్రి 11.15 గంటలకు గురువాయూర్ నుంచి ఎగ్మూరుకు బయలుదేరే ఎక్స్‌ప్రెస్ (16128)ను విరుదునగర్, మానామదురై, కారైక్కుడి, తిరుచ్చి మీదుగా దారి మళ్లించారు. ఈ రైలు మదురై, షోళవందాన్, దిండుగల్, మనప్పారై స్టేషన్లకు వెళ్లదు. అదే విధంగా బుధవారం ఉదయం 9 గంలకు ఎగ్మూరు నుంచి గురువాయూర్ బయలుదేరే ఎక్స్‌ప్రెస్ (16127) తిరుచ్చి, కారైక్కుడి, మానామదురై, విరుదునగర్ స్టేషన్ల మీదుగా పయనించనుంది. ఈ రైలు మనప్పారై, దిండుగల్, షోళవందాన్, కుడల్‌నగర్, మదురై స్టేషన్లకు వెళ్లదు.
మదురై ఎక్స్‌ప్రెస్ పాక్షిక రద్దు
ఈ నెల 12వ తేదీన ఉదయం 6 గంటలకు ఎగ్మూరు నుంచి మదురై బయలుదేరే తేజస్ ఎక్స్‌ప్రెస్ (22671) తిరుచ్చి వరకే వెళ్లనుంది. అదే విధంగా 12వ తేదీన సాయంత్రం 3 గంటలకు మదురై నుంచి ఎగ్మూరుకు బయలుదేరాల్సిన తేజస్ ఎక్స్‌ప్రెస్ (22672) సాయంత్రం 5.05 గంటలకు తిరుచ్చి నుంచి బయలుదేరనుంది.
Updated Date - 2023-04-11T10:54:10+05:30 IST