Haryana: ఆయనేమీ సీరియల్ కిల్లర్ కాదు...!
ABN, First Publish Date - 2023-03-01T17:12:14+05:30
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబాకు పెరోల్ ఇవ్వడాన్ని హర్యానా..
చండీగఢ్: డేరా సచ్చా సౌదా (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరాబాబాకు పెరోల్ ఇవ్వడాన్ని హర్యానా (Haryana) ప్రభుత్వం బుధవారంనాడు సమర్ధించింది. ఆయనేమీ సీరియల్ కిల్లర్ కాదని, రెండు హత్యల కేసులో ఆయనకు పడిన శిక్షను సీరియల్ కిల్లింగ్‌గా పేర్కొనరాదని వాదించింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం బుధవారంనాడు ఒక అఫిడవిట్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు సమర్పించింది.
పెరోల్‌ను సమర్ధించిన సీఎం
ఈ ఏడాది జనవరిలో మొదట్లో డేరాబాబాకు పెరోల్ మంజూరు చేయడాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సమర్ధించారు. ఈ విజయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. అత్యాచారం, హత్య కేసులో దోషిగా హర్యానా రోహ్‌టక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాకు జనవరి 21న 40 రోజుల పెరోల్ ఇవ్వడంపై సీఎం స్పందిస్తూ, ఆయనకు పెరోల్ ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించిన తర్వాతే పెరోల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పెరోల్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండదన్నారు. ఖైదీ ప్రవర్తనకు అనుగుణంగానే అధికారులు పెరోల్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 2021లో అత్యాచార నేరానికి డేరాబాబా, మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ జైలుశిక్ష విధించింది. ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం కేసులో 2017లో డేరా చీఫ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించడంతో హింసాత్మక ఘటనలు చేసుకుని 36 మంది వరకూ ప్రాణాలు కోల్పోవడంతో 144 సెక్షన్ విధించారు.
Updated Date - 2023-03-01T17:41:29+05:30 IST