Haryana: అల్లర్ల భయంతో నుహ్‌లో ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్
ABN, First Publish Date - 2023-09-15T14:53:17+05:30
హర్యానాలోని నుహ్ జిల్లాలో తాజా అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారంతో జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం రాత్రి 11.59 గంటల వరకూ ఇది అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది.
నుహ్: హర్యానా (Haryana) లోని నుహ్ (Nuh) జిల్లాలో తాజా అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారంతో ఆ జిల్లాలో ఇంటర్నెట్ (Internet) సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం రాత్రి 11.59 గంటల వరకూ ఇది అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది. శుక్రవారం ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాల్సిందిగా కూడా ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం కోరింది. జూలై 31 నుహ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు.
కాగా, నెహ్ జిల్లాలో ఉద్రిక్తతలు, ఆందోళనలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ధ్వంసం, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని చెబుతూ జిల్లా డిప్యూటీ కమిషనర్ తనకు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ టీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.
Updated Date - 2023-09-15T14:55:15+05:30 IST