ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Vijay: పొలిటికల్ ఎంట్రీపై అసలు విషయం చెప్పేసిన హీరో విజయ్‌.. ఆయన ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-07-12T07:53:03+05:30

తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు స్వస్తి పలుకుతానని హీరో విజయ్‌(Hero Vijay) పేర్కొన్నారు. మంగళవారం నగర శివారు ప్రాంతమైన ప

అడయార్‌(చెన్నై): తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు స్వస్తి పలుకుతానని హీరో విజయ్‌(Hero Vijay) పేర్కొన్నారు. మంగళవారం నగర శివారు ప్రాంతమైన పనైయూరులో ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’కు చెందిన జిల్లాల ప్రధాన నిర్వాహకులతో విజయ్‌ సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తొలి రోజున తిరువళ్ళూరు, అరియలూరు, పెరంబలూరు, దిండిగల్‌, సేలం, తేని(Dindigul, Salem, Theni) జిల్లాలకు చెందిన నిర్వాహకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత సమావేశ మందిరం నుంచి వెలుపలికి వచ్చిన మక్కల్‌ ఇయ్యక్కం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... ‘రాజకీయాల్లోకి వస్తే సినిమాల్లో నటించడం మానేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని విజయ్‌ చెప్పినట్టుగా వెల్లడించారు. అలాగే, ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేశామన్నారు. ఆయన కనుసైగతో రాజకీయాల్లోకి వచ్చి, ఆయనతో కలిసి పయనించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వెల్లడించారు. ఇదిలావుండగా.. ఇటీవల 10, 12వ తరగతుల పబ్లిక్‌ పరీక్షల్లో నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం తరపున ప్రోత్సాహక నగదు అందించిన విజయ్‌.. ఇపుడు అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో వరుసగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-07-12T07:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising