ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Vijay: క్రియాశీలక రాజకీయాల్లోకి సినీ హీరో విజయ్‌?

ABN, First Publish Date - 2023-07-04T09:02:25+05:30

ప్రముఖ నటుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారా?.. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారా?.. ఇందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహరచన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారా?.. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారా?.. ఇందులో భాగంగా సినిమాలు క్రమేణా తగ్గించుకుంటున్నారా?.. అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఒక ప్రముఖ తమిళ వెబ్‌సైట్‌ అయితే విజయ్‌(Vijay) సినిమాలకు ‘బైబై’ చెప్పేస్తున్నారని కూడా ప్రకటించేసింది. విజయ్‌ ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం తర్వాత వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘దళపతి 68’ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ‘దళపతి 68’ చిత్రం షూటింగ్‌ ముగిసిన అనంతరం క్రియాశీలక రాజకీయాలను నెరపాలని విజయ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. 2024 మే నెలలో వెంకట్‌( Vijay) ప్రభు చిత్రాన్ని పూర్తిచేసి, 2025వ సంవత్సరం పూర్తిగా ‘మక్కల్‌ ఇయక్కం’ క్షేత్రస్థాయి పనులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 2026లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున ఈ లోగా ‘కీలక అడుగు’ వేయాలని ఆయన గట్టిగా తలపోస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఆయన తన అత్యంత సన్నిహితులు, ఇద్దరు రాజకీయ నేతలతోనూ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆది నుంచి సామాజిక కార్యక్రమాల్లో ముందుండే విజయ్‌కి.. ఆయన అభిమానులు కూడా అండగా నిలిచారు. అయితే విజయ్‌ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు రేగడం, ఆ తరువాత అవి సమసిపోతుండడం నిత్యకృత్యంగానే ఉన్నా.. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇటీవల విద్యార్థుల ప్రశంసా కార్యక్రమంలో ఓటు హక్కు గురించి విజయ్‌ మాట్లాడ్డం, ఆయన హావభావాలు, ప్రజలను ఆకట్టుకునేలా సంభాషణ అంతా నాటకీయంగా సాగినట్లు కనిపిస్తోంది. ఇదంతా రాజకీయ ప్రవేశానికి ముందు జరిగే తంతేనని ఆయన అభిమాన సంఘాల్లోని ముఖ్యమైన వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-07-04T09:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising