Maoist Committee: కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోలేదు..
ABN, First Publish Date - 2023-01-12T15:33:13+05:30
ఛత్తీస్‌గఢ్: నిన్నటి సుక్మా ఎన్ కౌంటర్ (Sukma Encounter)పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కాల్పుల ఘటనపై గురువారం మావోయిస్టు కమిటీ లేఖ రాసింది.
ఛత్తీస్‌గఢ్: నిన్నటి సుక్మా ఎన్ కౌంటర్ (Sukma Encounter)పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కాల్పుల ఘటనపై గురువారం మావోయిస్టు కమిటీ లేఖ (Maoist Committee Letter) రాసింది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ విడుదల చేసింది. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hedma) చనిపోలేదని, ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, హిడ్మా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా దక్షిణ బస్తార్‌లోని జంగిల్ కొండలఫై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF), డ్రోన్ (Drone)లు, హెలికాప్టర్ (Helicopter) ద్వారా దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా వైమానిక బాంబులతో దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పెల్చారు. రాత్రి, పగలు లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు జరిగాయి. ఈ బీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోయారు. బుధవారం పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ధరెలి మార్కన్ గూడ మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
Updated Date - 2023-01-12T15:33:19+05:30 IST