CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..
ABN, First Publish Date - 2023-07-21T09:40:05+05:30
న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని తెలిపారు.
న్యూఢిల్లీ : న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని, అప్పుడే న్యాయ వ్యవస్థకుగల విశ్వసనీయత, ఔన్నత్యం ఇనుమడిస్తాయని, న్యాయమూర్తులపై సమాజానికిగల నమ్మకం బలపడుతుందని తెలిపారు.
అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రీ జూలై 14న రైల్వే అధికారులకు పంపిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, ఈ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ చౌదరి ఇటీవల న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రైలులో ప్రయాణించారు. ఈ రైలు మూడు గంటలకుపైగా ఆలస్యంగా నడిచిందని, ఈ ప్రయాణంలో తనకు కలిగిన అసౌకర్యంపై టీటీఈకి అనేకసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ, జస్టిస్ గౌతమ్‌కు అవసరమైనవాటిని అందజేయడానికి జీఆర్‌పీ సిబ్బంది బోగీలో అందుబాటులో లేరని తెలిపారు. తప్పు చేసిన రైల్వే అధికారులు ఈ తీవ్ర అసౌకర్యానికి కారణాలను తెలియజేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఓ లేఖను రాశారు. న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని, అప్పుడే న్యాయ వ్యవస్థకుగల విశ్వసనీయత, ఔన్నత్యం ఇనుమడిస్తాయని, న్యాయమూర్తులపై సమాజానికిగల నమ్మకం బలపడుతుందని తెలిపారు.
న్యాయమూర్తులు తమకు కల్పించిన ప్రత్యేక అధికారాలను సమాజం నుంచి తమను వేరు చేసే విధంగా కానీ, అధికార దర్పాన్ని ప్రదర్శించే విధంగా కానీ వినియోగించరాదని సీజేఐ తెలిపారు. రైల్వే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం హైకోర్టు న్యాయమూర్తికి లేదని స్పష్టం చేశారు. తన ఆందోళనను అన్ని హైకోర్టుల న్యాయమూర్తులకు తెలియజేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థలో స్వీయ మూల్యాంకన, కౌన్సెలింగ్ అవసరమని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Speaker: మీలా నేనూ మనిషినే.. విందుకు వెళితే తప్పేంటి?
Former CM: రహదారి టెండర్ల అవినీతి కేసు.. సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేవియట్
Updated Date - 2023-07-21T09:40:05+05:30 IST