ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

High court judge : తప్పిపోయిన పెంపుడు కుక్క.. పోలీసులపై హైకోర్టు జడ్జి ఆగ్రహం..

ABN, First Publish Date - 2023-07-23T11:35:45+05:30

ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క మాయమవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరాంగ్ కాంత్‌కు ఆవేదన కట్టలు తెంచుకుంది. అంకితభావంతో పని చేయని తన ఇంటి భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఉదాసీనంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

న్యూఢిల్లీ : ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క మాయమవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరాంగ్ కాంత్‌కు ఆవేదన కట్టలు తెంచుకుంది. అంకితభావంతో పని చేయని తన ఇంటి భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఉదాసీనంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన తన డిమాండ్‌ను ఉపసంహరించుకుని, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోనక్కర్లేదని తెలిపారు.

ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ గౌరాంగ్ కాంత్‌ను ఇటీవల కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. తన బంగళాలో తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్క మాయమైపోయినట్లు ఆయన గుర్తించారు. ప్రహరీ గోడ తలుపులు బార్లా తెరిచి ఉండటంతో అది ఎక్కడికో వెళ్లిపోయిందని, అది ఏదైనా వాహనం క్రింద పడిపోయి మరణించి ఉంటుందని ఆయనకు ఆవేదన కలిగింది. దీంతో వెంటనే ఆయన జూన్ 12న ఢిల్లీ సంయుక్త పోలీస్ కమిషనర్ (భద్రత విభాగం)కు ఓ లేఖ రాశారు. తన బంగళా వద్ద నియమితులైన భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన బంగళా గేట్లకు తాళాలు వేయనందువల్లే తన పెంపుడు కుక్క మాయమైపోయిందని తెలిపారు.

తాను ఈ లేఖను ఎంతో ఆవేదన, బాధతో రాస్తున్నానని చెప్పారు. తన బంగళా వద్ద భద్రత కల్పిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్లే తన కుక్క వెళ్లిపోయిందని ఆరోపించారు. తలుపులకు తాళాలు వేయాలని పదే పదే తాను చెప్పినప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఇటువంటి నిరాసక్తత, అసమర్థతలపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల తన ప్రాణాలకు, స్వేచ్ఛకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. బంగళాలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్లిపోతున్నారు? వంటివాటిపై భద్రతా సిబ్బంది దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం వహించడం సహించరానిదని చెప్పారు.

ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, జస్టిస్ కాంత్ ఈ లేఖ రాసిన తర్వాత తమతో మాట్లాడారని, తన బంగళా వద్ద నియమితులైన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోనక్కర్లేదని చెప్పారని తెలిపారు.

ఇదిలావుండగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఇటీవల అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఓ లేఖ రాశారు. ఇతరులకు అసౌకర్యం కలిగేవిధంగా కానీ, న్యాయ వ్యవస్థ విమర్శలపాలయ్యే విధంగా కానీ న్యాయమూర్తులు తమ విశేష అధికారాలను వినియోగించుకోరాదని తెలిపారు.

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇటీవల రైలులో ప్రయాణించారు. ఆ రైలు దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచింది. ఆ సమయంలో టీటీఈకి పదే పదే చెప్పినప్పటికీ, తనకు కావలసినవాటిని అందజేయడానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని ఆ న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తికి కలిగిన అసౌకర్యానికి వివరణ ఇవ్వాలని ఆ హైకోర్టు రిజిస్ట్రీ రైల్వే అధకారులకు లేఖ రాసింంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ చంద్రచూడ్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Updated Date - 2023-07-23T11:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising