ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dharmendra pradhan: 'ఇండియా' కూటమి నిజమైన సవాలే.. అంగీకరించిన కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2023-10-06T19:09:33+05:30

విపక్ష ఇండియా కూటమి తమకు నిజమైన సవాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి కూడా దేశానికి సేవలందించాలన్నదే బీజేపీ అజెండా అని చెప్పారు. ఏ ఎన్నికలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకోదని అన్నారు.

న్యూఢిల్లీ: విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి తమకు నిజమైన సవాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి కూడా దేశానికి సేవలందించాలన్నదే బీజేపీ (BJP) అజెండా అని చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, ఏ ఎన్నికలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకోదని, ఆ కారణంగానే 'ఇండియా' బ్లాక్‌ను ప్రధాన సవాలుగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ కింది స్థాయి కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకూ ప్రతి ఒక్కరూ చాలా సీరియస్‌గా తీసుకుని పనిచేస్తారని, ప్రధాన మంత్రి మోదీ తమను ముందుండి నడిపిస్తుంటారని తెలిపారు.


లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారనే ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, తన స్వరాష్ట్రమైన ఒడిశా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న విషయాన్ని ఇప్పటికే పార్టీ దృష్టికి తెచ్చానని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరానని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ, దేశంలోని తల్లులు, సోదరీమణులకు రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ఆయన ఒక ఉదాహరణగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి చిత్తశుద్ధి చూపించలేదని, బిల్లు గడువు కూడా తీరిపోయిందని అన్నారు. అవకాశం వచ్చినా వాళ్లు (కాంగ్రెస్) దానిని ఉపయోగించుకోలేకపోయారని విమర్శించారు.


దేశవ్యాప్తంగా కులగణన జరపాలని రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‌ను ధర్మేంద్ర ప్రధాన్ తిప్పికొట్టారు. గత 75 ఏళ్లలో ఓబీసీలు, బలహీన వర్గాల కోసం రాహుల్, ఆయన కుటుంబ పార్టీ ఏమి చేసిందో ఆ వివరాలు షేర్ చేయాలని అన్నారు.

Updated Date - 2023-10-06T19:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising