ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IAS officers: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ABN, First Publish Date - 2023-06-20T08:24:20+05:30

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్(IAS)‏లకు స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరై అన్బు సోమవారం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్(IAS)‏లకు స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరై అన్బు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూసంస్కరణల విభాగ కమిషనర్‌గా డాక్టర్‌ బీలా రాజేష్‏ను విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఆ పదవిలో వున్న రమేష్‌ చంద్‌ మీనాను ప్రత్యేక సంక్షేమ పథకాల అమలు విభాగ అదనపు ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. తిరువణ్ణామలై(Tiruvannamalai) జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ అదనపు కలెక్టర్‌ వీర్‌ప్రతాప్ సింగ్‌ను వాణిజ్యపనుల విభాగ జాయింట్‌ కమిషనర్‌గా, సేలంలోని పట్టుపురుగుల ఉత్పత్తి విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.విజయరాణిని సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్‌గా, తమిళనాడు ఎనర్జీ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.ఆసియా మరియంను మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, పట్టణ, పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌ శాఖమూరిని సేలంలోని పట్టుపురుగుల ఉత్పత్తి విభాగ డైరెక్టర్‌గా, తమిళనాడు స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌ను తమిళనాడు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. ఇదే విధంగా తమిళనాడు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా వున్న డాక్టర్‌ ఎస్‌.స్వర్ణను తమిళనాడు స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, జల వనరుల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ఆర్‌.కన్నన్‌ను తమిళనాడు సిమెంట్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, జంతు సంరక్షణ, డెయిరీ, మత్స్య, మత్స్యకారుల సంక్షేమశాఖ ఉప కార్యదర్శి రంజిత్‌సింగ్‌ను నాగపట్టినం జిల్లా రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ ప్రాజెక్టు ఆఫీసర్‌గా బదిలీ చేశారు. కోయంబత్తూరు జిల్లా రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ పి.అలమేల్‌మంగైను సేలం జిల్లా రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, మైనారిటీ సంక్షేమ విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సురేష్ ను తమిళనాడు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈవోగా బదిలీ చేశారు.

Updated Date - 2023-06-20T08:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising