Ilayaraja: రామేశ్వరం ఆలయంలో ఇళయరాజా పూజలు
ABN, First Publish Date - 2023-08-17T08:09:26+05:30
ఆడి అమావాస్యను పురస్కరించుకుని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) బుధవారం రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం
అడయార్(చెన్నై): ఆడి అమావాస్యను పురస్కరించుకుని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) బుధవారం రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత సముద్ర స్నానం చేసి, తమ పితృదేవతలకు తర్పణం సమర్పించారు. ఆ తర్వాత 22 బావుల నీటితో పుణ్యస్నానం చేశారు. పర్వతవర్ధిని అమ్మవారిని, రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. తిరుమిళిసై సమీపంలో ఉన్న ఈశ్వరన్ ఆలయంలో బుధవారం ఉదయం నటుడు సెంథిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ ఉన్న కోనేరులో తమ పితృదేవతలకు ఆయన తర్పణం వదిలారు.
Updated Date - 2023-08-17T08:09:26+05:30 IST