ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IMD: నేడు 15 జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయట...

ABN, First Publish Date - 2023-04-23T07:52:02+05:30

ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని 15 జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురవనున్నాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని 15 జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురవనున్నాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నగరంలోను, పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) ప్రాంతాల్లోనూ తేలికపాటి జల్లులు కురియడంతో వాతావరణం చల్లబడినట్లు పేర్కొన్నారు. చెన్నై, సబర్బన్‌ ప్రాంతాల్లో 48 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలుచోట్లు ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందన్నారు. ఇక ఆదివారం నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్‌, తేని, దిండుగల్‌, తిరునల్వేలి, తెన్‌కాశి, సేలం, ధర్మపురి, కళ్లకురిచ్చి, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కుండపోత, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల కురుస్తాయన్నారు. ఆదివారం వేకువజాము, రాత్రి చెన్నై సహా సబర్బన్‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చెన్నై(Chennai)లో శనివారం మధ్యాహ్నం కురిసిన మోస్తరు వర్షానికి గత వారం రోజులుగా ఎండవేడిమితో అల్లాడిన నగరవాసులంతా ఊరట చెందారు. నగరమంతటా సాయంత్రం ఐదు గంటలకు చల్లటి గాలులు వీచాయి.

Updated Date - 2023-04-23T07:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising