ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A. bloc: కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సమన్వయ కమిటీ

ABN, First Publish Date - 2023-09-13T20:14:15+05:30

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన విపక్ష ఇండియా కూటమి దేశవ్యాప్తంగా సంయుక్త ర్యాలీలు నిర్వహించేందుకు నిర్ణయించింది. తొలి ర్యాలీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో అక్టోబర్‌లో నిర్వహించనుంది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి దేశవ్యాప్తంగా సంయుక్త ర్యాలీలు (joint rally) నిర్వహించేందుకు నిర్ణయించింది. తొలి ర్యాలీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ (Bhopal)లో అక్టోబర్‌లో నిర్వహించనుంది. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో బుధవారం సాయంత్రం జరిగిన ఇండియా బ్లాక్ సమన్వయ కమిటీ (coordination committee) తొలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. డి.రాజా, జావెద్ అలీ, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, గుర్దీప్ సింగ్ సప్పల్, టీఆర్ బాలు, తేజస్వి యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమన్వయ కమిటీ సభ్యులైన జేడీయూ నేత లలన్ సింగ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ వివిధ కారణాల రీత్యా సమావేశంలో పాల్గొనలేదు.


సమన్వయ కమిటీ నిర్ణయాలివే..

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్టు సమవేశానంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్), ఇండియా బ్లాక్ సమన్వయ కమిటీ, ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అక్టోబర్ తొలి వారంలో భోపాల్‌లో ఇండియా కూటమి తొలి సంయుక్త ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. బీజేపీ హయాంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, అవినీతి వంటి అంశాలను తాము లేవనెత్తనున్నట్టు చెప్పారు. జన గణన అంశాన్ని లేవనెత్తేందుకు కూడా పార్టీలు అంగీకరించాయని, సీట్ల పంపకాలను నిర్ణయించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ ప్రారంభించాలని కూడా సమన్వయ కమిటీ నిర్ణయించిందని వివరించారు. సమన్వయ కమిటీ తొలి సమవేశంలో 12 పార్టీల సభ్యులు హజరయ్యారని కేసీ వేణుగోపాల్ వివరించారు.

Updated Date - 2023-09-13T20:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising