ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India Vs China : నమ్మకం దెబ్బతింది.. చైనాకు తెగేసి చెప్పిన అజిత్ దోవల్..

ABN, First Publish Date - 2023-07-25T13:46:29+05:30

సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలను సృష్టిస్తున్న చైనాను భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) తీవ్రంగా ఎండగట్టారు. ఇరు దేశాలకు సరిహద్దుగా పరిగణిస్తున్న వాస్తవాధీన రేఖ (LAC) రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న పరిస్థితుల వల్ల పరస్పర వ్యూహాత్మక విశ్వాసం దెబ్బతిందని స్పష్టం చేశారు.

Wang Yi, Ajit Doval

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలను సృష్టిస్తున్న చైనాను భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) తీవ్రంగా ఎండగట్టారు. ఇరు దేశాలకు సరిహద్దుగా పరిగణిస్తున్న వాస్తవాధీన రేఖ (LAC) రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న పరిస్థితుల వల్ల పరస్పర వ్యూహాత్మక విశ్వాసం దెబ్బతిందని, అదే విధంగా ప్రభుత్వ, రాజకీయ సంబంధాలకు కూడా విఘాతం కలిగిందని స్పష్టం చేశారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, దక్షిణాఫ్రికాలోని జొహెన్నస్‌బర్గ్‌లో సోమవారం అజిత్ దోవల్, చైనా దౌత్యవేత్త వాంగ్ యీ సమావేశమయ్యారు. బ్రిక్స్ (BRICS) మిత్రుల సమావేశం నేపథ్యంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్ అని పిలుస్తారు. వాంగ్ యీ చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, సీపీసీ ఫారిన్ అఫైర్స్ కమిషన్ డైరెక్టర్. సరిహద్దులపై చర్చలో భారత దేశ ప్రతినిధిగా అజిత్ దోవల్, చైనా ప్రతినిధిగా వాంగ్ యీ పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించేందుకు, శాంతి, సామరస్యాల పునరుద్దరణకు దృఢ సంకల్పంతో కృషి కొనసాగాలని అజిత్ దోవల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి కృషి జరగాలని చెప్పారు. ఇటువంటి రిప్రజెంటేషన్ లెవల్ చర్చలు 2019లో జరిగాయి.

వాంగ్ యీ మాట్లాడుతూ, వ్యూహాత్మక పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలని చెప్పారు. పరస్పర సమ్మతి, సహకారంపై దృష్టి సారించాలన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సాధ్యమైనంత త్వరగా సుస్థిర, పటిష్ట అభివృద్ధి బాటలో పడాలన్నారు. చైనా ఎన్నడూ ఆధిపత్యం కోసం ఒత్తిడి చేయదని, భారత దేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అనేక దేశాలతో సమన్వయం కుదుర్చుకుని పని చేయడానికి సహకరిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యవస్థ న్యాయంగా అభివృద్ధి జరగడాన్ని ప్రోత్సహిస్తుందని, అంతర్జాతీయ సంబంధాలు ప్రజాస్వామికీకరణ జరగడానికి మద్దతిస్తుందని తెలిపారు. భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాలకు మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమని ఉభయ దేశాలు అంగీకరించాయి.

ఇటీవల విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇండోనేషియాలోని జకార్తాలో వాంగ్ యీని కలిశారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం ఏర్పడాలంటే చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు.

చైనా దురాక్రమణ బుద్ధి వల్ల భారత దేశం దశాబ్దాలుగా సమస్యలను ఎదుర్కొంటోంది. తూర్పు లడఖ్‌లో చైనా దళాల మోహరింపు, భారత సైన్యంతో ఘర్షణ కారణంగా దాదాపు మూడేళ్ల నుంచి ప్రతిష్టంభన ఏర్పడింది.

ఇవి కూడా చదవండి :

CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

Updated Date - 2023-07-25T13:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising