ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: స్థిరమైన ప్రభుత్వంతోనే దేశంలో శీఘ్ర అభివృద్ధి: మోదీ

ABN, First Publish Date - 2023-10-30T19:56:59+05:30

దేశం శీఘ్ర అభివృద్ధి దిశగా దూసుకుపోతుండటం, ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకోవడానికి ప్రజలు సుస్ధిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రూ.5.950 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని సోమవారంనాడు శంకుస్థాపన చేశారు.

మెహసానా: దేశం శీఘ్ర అభివృద్ధి దిశగా దూసుకుపోతుండటం, ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకోవడానికి ప్రజలు సుస్ధిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. గుజరాత్ (Gujarat) పర్యటనలో భాగంగా రూ.5.950 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని సోమవారంనాడు శంకుస్థాపన చేశారు. అనంతరం మెహసానా జిల్లా ఖేరాలులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, గుజరాత్‌లో చిరకాలంగా అధికారంలో ఉన్న సుస్ధిర ప్రభుత్వం వల్లే ఒక నిర్ణయం వెంబడి మరో నిర్ణయం తీసుకోవడం, తద్వారా రాష్ట్రానికి ఎంతో లబ్ది చేకూరడం జరిగందన్నారు.


మాట ఇస్తే నెరవేరుస్తా...

ఒకసారి మాట ఇస్తే దానిని తప్పనిసరిగా తాను నెరవేరుస్తానని ప్రధాని చెబుతూ...''మీరు ప్రధానిగా కంటే నరేంద్రభాయ్‌గానే నన్ను ఎక్కువ ఆదరిస్తుంటారు. మీ నరేంద్రభాయ్ ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడనే విషయం మీ అందరికీ తెలుసు'' అని ప్రధాని అన్నారు. కాగా, దీనికి ముందు బనస్కాంత జిల్లాలోని అంబా ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-10-30T19:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising