ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India Vs China : చైనా ప్రకటనను తోసిపుచ్చిన భారత ప్రభుత్వ వర్గాలు

ABN, First Publish Date - 2023-08-25T11:34:59+05:30

బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో భారత దేశం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జీ జిన్‌పింగ్ చర్చలు జరిపారని చైనా విడుదల చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సమావేశానికి చైనా చేసిన విజ్ఞప్తిపై భారత దేశం నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపింది.

న్యూఢిల్లీ : బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో భారత దేశం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జీ జిన్‌పింగ్ చర్చలు జరిపారని చైనా విడుదల చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సమావేశానికి చైనా చేసిన విజ్ఞప్తిపై భారత దేశం నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపింది. భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది.

చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో, మోదీ (Prime Minister Narendra Modi) విజ్ఞప్తి మేరకు ఆయనతో జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) ద్వైపాక్షిక చర్చలు జరిపారని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు (BRICS Summit) నేపథ్యంలో ఈ నెల 23న ఈ చర్చలు జరిగినట్లు తెలిపారు. ప్రస్తుత చైనా-భారత్ సంబంధాలపై ఇరువురు నేతలు లోతుగా, అరమరికలు లేకుండా తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఇరు దేశాలకు ఆసక్తిగల ఇతర అంశాలపై కూడా మాట్లాడారని తెలిపారు. బ్రిక్స్ సమావేశాలు ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన సంగతి తెలిసిందే.

చైనా ప్రకటనపై భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా గురువారం స్పందిస్తూ, బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో జీ జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారని తెలిపారు. ఇతర బ్రిక్స్ దేశాల నేతలతో కూడా మోదీ మాట్లాడారని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి, భారత్-చైనా సరిహద్దుల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై భారత దేశ ఆందోళనను జిన్‌పింగ్‌కు వివరించినట్లు చెప్పారు.


చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో, చైనా-భారత్ సంబంధాలు మెరుగుపడటం వల్ల ఇరు దేశాలు, ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు జరుగుతుందని జీ జిన్‌పింగ్ నొక్కి వక్కాణించారని చెప్పారు. సత్సంబంధాలు మెరుగుపడితే ప్రపంచం, ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడానికి, శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని చెప్పారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యాలను ఉమ్మడిగా పరిరక్షించుకోవడానికి వీలుగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ ప్రకటన తెలిపింది.

బ్రిక్స్ సదస్సులో గురువారం మోదీ, జిన్‌పింగ్ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ వేదికపైకి వెళ్లేటపుడు పక్కపక్కనే నడుస్తూ క్లుప్తంగా మాట్లాడుకున్నట్లు కనిపించింది.

తూర్పు లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలు 2020 మే నెలలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మోదీ, జిన్‌పింగ్ 2022 నవంబరులో ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సు సందర్భంగా కలిశారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించవలసిన అవసరం గురించి జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు.


ఇవి కూడా చదవండి :

Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

Updated Date - 2023-08-25T11:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising