India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ
ABN, First Publish Date - 2023-11-22T14:35:38+05:30
భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
న్యూఢిల్లీ: భారత, కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను (E-Visa Services) భారత్ పునరుద్ధరించింది. గత జూన్‌లో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నజ్జర్ హత్య వెనుక ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో గత సెప్టెంబర్ నుంచి ఒట్టావోతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. కెనడా ఆరోపణలను నిరాధారమని ఇండియా తోసిపుచ్చింది. ఇరు దేశాలు దౌత్యవైత్యలను తమ దేశాన్ని విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో కెనడా పౌరులకు గత సెప్టెంబర్ 21 నుంచి నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ బుధవారంనాడు పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
వర్చువల్ మీట్‌లో ట్రూడో
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సమావేశం విజయవంతం కావడం, ఏకగ్రీవంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న క్రమంలో జీ-20 దేశాధినేతల వర్చువల్ సదస్సు బుధవారం జరుగనుంది. ఈ వర్చువల్ మీట్‌లో జస్టిన్ ట్రూడో పాల్గొనే విషయంలో సందిగ్దత నెలకొన్నప్పటికీ, ఆయన వర్చువల్ మీట్‌లో పాల్గొంటారని ఒట్టావా స్పష్టత ఇచ్చింది.
Updated Date - 2023-11-22T14:35:39+05:30 IST