Indian Railways: దేశంలో నేడు 320 రైళ్ల రద్దు
ABN, First Publish Date - 2023-01-17T10:34:32+05:30
దేశంలో మంగళవారం 320 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు....
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం 320 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.(Indian Railways) వాతావరణ ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక కారణాలు, రైళ్లు, రైల్వే ట్రాక్ ల నిర్వహణ పనుల కారణంగా మంగళవారం ఒక్కరోజే 320 రైళ్లను రద్దు(Cancels) చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. చలిగాలులు, దట్టమైన మంచు వాతావరణం వల్ల 41 రైళ్లను రద్దు చేశారు. మరో 39 రైళ్లను కుదించారు. మరో 7 రైళ్లను దారి మళ్లించగా, మరో 16 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.పఠాన్ కోట్, భోపాల్, లక్నో, ప్రయాగరాజ్, దర్బంగా, సీల్ధా,హౌరా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, హోషియార్ పూర్,జలంధర్, రాంనగర్, కోయంబత్తూర్, బిలాస్ పూర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో 320 రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు టికెట్ చార్జీలను వాపసు ఇస్తున్నామని రైల్వే అధికారులు చెప్పారు.
Updated Date - 2023-01-17T10:34:34+05:30 IST