IPS: మాజీ ఐపీఎస్‌ల నివాసాల్లో ఆర్డర్లీ వ్యవస్థ రద్దు
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:42 PM
రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల(Retired IPS officers) నివాసాల్లో కుటుంబ సేవలు చేసే ఆర్డర్లీ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎ్‌సల నివాసాల్లో పోలీసు కానిస్టేబుల్ హోదా కలిగిన వారు సేవలు అందిస్తుండేవారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల(Retired IPS officers) నివాసాల్లో కుటుంబ సేవలు చేసే ఆర్డర్లీ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎ్‌సల నివాసాల్లో పోలీసు కానిస్టేబుల్ హోదా కలిగిన వారు సేవలు అందిస్తుండేవారు. ఏళ్ల తరబడి వారు ఇవే విధులతోనే కొ నసాగుతున్నారు. మాజీ ఐపీఎస్‌ల వద్ద పనిచేసే సిబ్బందిని వెనక్కు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మాజీ పోలీసు అధికారులకు షాక్ తగిలినట్లు అయింది. ఆర్డర్లీలుగా కేఎ్‌సఆర్‌పీ కానిస్టేబుళ్ళు ఉంటారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేఎస్ఆర్‌పీ డీజీపీకి ప్రభుత్వం సూచించింది. తగిన నివేదికను వెంటనే ప్రభుత్వానికి స మర్పించాలని ఆదేశించింది. మాజీ డీజీపీ స్థాయి అధికారులు రూపక్ కుమార్ దత్త, కిశోర్‌చంద్ర, ఏడీజీపీ స్థాయిలో కొనసాగిన సునిల్ అగర్వాల్, భాస్కర్‌రావ్ ఆర్డరీ సేవలు పొందుతున్నారు. భాస్కర్‌రావ్ వీఆర్‌ఎస్ తీసుకుని తర్వాత ఆప్ పార్టీలోను తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల చామరాజపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. భాస్కర్‌రావ్ వద్ద సి బ్బంది సేవలు పట్ల తీవ్రమైన విమర్శలు వచ్చిన మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ పొందిన 15 రోజుల్లో ఆర్డర్లీ సే వలు అందించే కానిస్టేబుళ్ళను శాఖకు వాపసు పంపాల్సి ఉంటుంది. సీఐడీ డీజీగా సేవలందించిన కిశోర్‌చంద్ర ప్రస్తుతం రేరా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో రిటైర్డ్‌మెంట్ తర్వాత తాము వివిధ హోదాల్లో సేవలందిస్తున్నట్లు ముగ్గురు అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
Updated Date - Dec 23 , 2023 | 12:42 PM