ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Iran : ఇరానియన్ నటి వీర విహారం... 18 రోజులు జైల్లో పెట్టినా ప్రభుత్వంపై చెదరని ధిక్కారం...

ABN, First Publish Date - 2023-01-06T19:02:35+05:30

ఇరానియన్ సినీ రంగంలో ప్రముఖ నటీనటుల్లో తరనేహ్ అలిదూస్తి ఒకరు. ‘ది సేల్స్‌మేన్’ అనే ఆస్కార్ విన్నింగ్ ఫిలింలో కూడా ఆమె నటించారు.

Iranian Actress Taraneh Alidoosti
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇరాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వ విధానాలపై పోరాటంలో ఆ దేశంలోని ప్రముఖ నటి తరనేహ్ అలిదూస్తి (Taraneh Alidoosti) చెక్కు చెదరని ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికినందుకు ఆమెను 18 రోజులపాటు జైలులో నిర్బంధించినప్పటికీ, జైలు నుంచి విడుదలైనపుడు హిజాబ్ ధరించకుండానే బయటకు వచ్చారు.

ఇరానియన్ సినీ రంగంలో ప్రముఖ నటీనటుల్లో తరనేహ్ అలిదూస్తి ఒకరు. ‘ది సేల్స్‌మేన్’ అనే ఆస్కార్ విన్నింగ్ ఫిలింలో కూడా ఆమె నటించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసన, ఉద్యమాలకు ఆమె మద్దతుగా నిలిచారు. నవంబరులో ఆమె హెడ్‌స్కార్ఫ్ ధరించకుండా తన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఉద్యమకారులు చెప్తున్న నినాదాల్లో ఒకటైన ‘‘మహిళ, జీవితం, స్వేచ్ఛ’’ అనే నినాదాన్ని ఆమె ఈ పోస్ట్‌తోపాటు పెట్టారు.

దీంతో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ, ఆమెను డిసెంబరు 17న అరెస్ట్ చేశారు. ఆమెను టెహరాన్‌లోని జైలు నుంచి బుధవారం విడుదల చేశారు. ఆమె బంధుమిత్రులు ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ సమయంలో తీసిన ఫొటోల్లో స్పష్టంగా ఆమె ధీరత్వం కనిపిస్తోంది. ఆమె హిజాబ్ ధరించకుండా జైలు బయటకు రావడం నిరసనకారులకు గొప్ప ఉత్తేజాన్నిచ్చింది.

ఇదిలావుండగా, అలిదూస్తిని విడుదల చేయాలని చాలా మంది హాలీవుడ్ నటీనటులు బహిరంగ లేఖ రాశారు. ఆమెతో కలిసి అనేక సినిమాల్లో నటించిన అస్ఘర్ ఫర్హది కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.

హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తున్నందుకు అనేకమంది కళాకారులను, పాత్రికేయులను ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. నిరసనకారులపై పోలీసుల దాష్టీకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన న్యాయవాదులను కూడా అరెస్ట్ చేస్తోంది.

ఇరాన్‌లో మహిళలకు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉంది. దీనిని కట్టుదిట్టంగా అమలు చేస్తారు. సరైన రీతిలో హిజాబ్ ధరించలేదనే కారణంతో 2022 సెప్టెంబరు 16న మహసా అమిని (22)ని మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగా ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

Updated Date - 2023-01-06T19:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising