ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం

ABN, First Publish Date - 2023-10-14T20:13:29+05:30

ఇజ్రాయెల్-గాజా యుద్ధం అంతకంతకూ భీకరంగా మారడంతో పరిస్థితిపై చర్చించేందుకు అత్యవసర అసాధారణ సమావేశానికి ఇస్లామిక్ దేశాల అత్యున్నత గ్రూప్ ...ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ పిలుపునిచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రతరం చేయడం, గాజాలో ఎలాంటి రక్షణకు నోచుకోని పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటాన్ని ఈ సమావేశంలో చర్చించాలని ఓఐసీ భావిస్తోంది.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-గాజా యుద్ధం (Israel-Gaza War) అంతకంతకూ భీకరంగా మారడంతో పరిస్థితిపై చర్చించేందుకు అత్యవసర అసాధారణ సమావేశానికి (Urgent Extraordinary meeting) ఇస్లామిక్ దేశాల అత్యున్నత గ్రూప్ ...ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) పిలుపునిచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రతరం చేయడం, గాజాలో ఎలాంటి రక్షణకు నోచుకోని పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటాన్ని ఈ సమావేశంలో చర్చించాలని ఓఐసీ భావిస్తోంది. ఇస్లామిక్ సమ్మిట్‌‌ ప్రస్తుత సెషన్‌కు అధ్యక్షత వహిస్తున్న సౌదీ అరేబియాలోని జెద్దాలో వచ్చే వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.


''సౌదీ అరేబియా కింగ్‌డమ్ ఆహ్వానం మేరకు, సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తోంది. మంత్రుల స్థాయిలో ఈ సమావేశం ఉంటుంది. గాజాపై సైనిక చర్యల తీవ్రత, ఫలితంగా సాధారణ పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడటం, గాజా ప్రాంత భద్రత, సుస్థిరతపై సమావేశంలో చర్చిస్తాం'' అని ఓసీఐ సొంత వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తర్వాత అతిపెద్ద సంస్థగా ఓఐసీ ఉంది. నాలుగు ఖండాల్లోని 57 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. ఇజ్రాయెల్‌‌తో చర్చలను సౌదీ అరేబియా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఓఐసీ ఈ అత్యవసర సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


అక్టోబర్ 7న పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి పాల్పడంతో 1,300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని సుమారు 2,215 మంది మరణించారు. గాజాలో పాలస్తీనా ప్రజలకు నిలువనీడలేకుండా చేయడం, తమను తాము కాపాడుకోలేని స్థితిలో ఉన్న సాధారణ పౌరులపై దాడి జరపడంపై ఇజ్రాయెల్‌ను సౌదీ అరేబియా తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది.

Updated Date - 2023-10-14T20:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising