ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VK Singh: పాక్‌ను ఐసొలేట్ చేయాలి: వీకే సింగ్

ABN, First Publish Date - 2023-09-14T16:12:13+05:30

ఇండియాపై ఉగ్రదాడులకు అడ్డుకట్టు వేయాలంటే పాకిస్థాన్‌ ను ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బుధవారంనాడు ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్‌పీ హుమయూన్ ప్రాణాలు కోల్పోవడంపై వీకే సింంగ్ స్పందించారు.

న్యూఢిల్లీ: ఇండియాపై ఉగ్రదాడులకు అడ్డుకట్టు వేయాలంటే పాకిస్థాన్‌ (Pakistan)ను ఒంటరి (Isolate) చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ (VK Singh) అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బుధవారంనాడు ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్‌పీ హుమయూన్ ప్రాణాలు కోల్పోవడంపై వీకే సింగ్ స్పందించారు.


''మనం బాగా ఆలోచన చేయాలి. పాకిస్థాన్‌ను మనం ఒంటరిని చేయకపోతే ఉగ్రదాడులను పాకిస్థాన్ నిత్యకృత్యం చేస్తూనే ఉంటుంది. మనం వాళ్లపై (పాక్) ఒత్తిడి తేవాలనుకుంటే వారిని ఒంటరిని చేయాల్సి ఉంటుంది. సాధారణ సంబంధాలు నెలకొనాలని అవతళ వాళ్లు అభిలషిస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని పాక్‌ గ్రహించాల్సి ఉంటుంది'' అని వీకే సింగ్ అన్నారు.


కాగా, అనంతనాగ్ దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఆఫ్‌షూట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినట్టు అధికారులు గురువారంనాడు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో తమ అనుభవజ్ఞుడైన నాయకుడిని చంపినందుకు ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు లష్కరే తోయిబా ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ అనంతనాగ్‌లో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని ఉజైర్ ఖాన్‌గా గుర్తించారు.

Updated Date - 2023-09-14T16:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising