ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రయాన్-3 ఉత్కంఠభరిత సన్నివేశాల ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం నుంచి : ఇస్రో

ABN, First Publish Date - 2023-08-22T13:41:00+05:30

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారతీయులు చంద్రయాన్-3 విజయవంతం కావాలని బలంగా కోరుకుంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించినట్లుగా ఈ నెల 23న జాబిల్లిపైన భారత దేశం ముద్ర పడాలని ఆకాంక్షిస్తున్నారు.

Chandrayaan-3

న్యూఢిల్లీ : అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారతీయులు చంద్రయాన్-3 విజయవంతం కావాలని బలంగా కోరుకుంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించినట్లుగా ఈ నెల 23న జాబిల్లిపైన భారత దేశం ముద్ర పడాలని ఆకాంక్షిస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇస్రో కూడా ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలంతా చూడటం కోసం ఈ ఉద్విగ్నభరిత సన్నివేశాలను ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, డీడీ నేషనల్ టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. ఈ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టవలసి ఉంది.

బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)కు చెందిన మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (MOX) నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని తెలిపింది. ఈ నెల 19న దాదాపు 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (LPDC) తీసిన చంద్రుని ఫొటోలను షేర్ చేసింది.

చంద్రయాన్-3 మిషన్ షెడ్యూలు ప్రకారం జరుగుతోందని, సిస్టమ్స్‌ను క్రమబద్ధంగా తనిఖీ చేస్తున్నామని తెలిపింది. అన్ని వ్యవస్థలు సజావుగా పని చేస్తున్నాయని వివరించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌లో ఉన్నవారంతా చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా ఉన్నట్లు తెలిపింది. తన స్థానాన్ని నిర్ణయించుకోవడానికి ల్యాండర్ మాడ్యూల్‌‌కు ఎల్‌పీడీసీ తీసిన చిత్రాలు ఉపయోగపడతాయని చెప్పింది.


ఖగోళ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌సీ కపూర్ మాట్లాడుతూ, ల్యాండర్, రోవర్ ప్రస్తుతం చంద్రుని ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలో తిరుగుతున్నట్లు తెలిపారు. గతంలో ఎదురైన పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ రెండిటిని తయారు చేసినట్లు చెప్పారు. ఈ ఆల్గోరితమ్ లోపరహితంగా ఉందన్నారు. అంతేకాకుండా ల్యాండర్‌కు అత్యంత ముఖ్యమైన లెగ్ మెకానిజం చాలా బలంగా ఉందని చెప్పారు.

చంద్రయాన్-3 విజయవంతమవాలని ప్రత్యేక పూజలు, హోమాలు

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందినవారు చంద్రయాన్-3 విజయవంతమయ్యే విధంగా ఆశీర్వదించాలని భగవంతునికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. చంద్రయాన్ నమూనాల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. ముంబైలోని చంద్రమౌళీశ్వర శివాలయంలో శివసేన-యూబీటీ నేత ఆనంద్ దూబే ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, చంద్రయాన్-3 మన దేశానికి చరిత్రాత్మకమైనదని చెప్పారు. దీనిపై ఎవరూ రాజకీయాలు చేయకూడదన్నారు. మన శాస్త్రవేత్తలు దీని కోసం అనేక సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. వారిని ప్రశంసించాలని చెప్పారు. కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, మనం శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలవాలని చెప్పారు.

చంద్రయాన్-3 విజయవంతమైతే జాబిల్లిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత దేశం చరిత్ర సృష్టిస్తుంది. అంతేకాకుండా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొదటి దేశంగా మన దేశం ఘనత సాధిస్తుంది. ఇదిలావుండగా, ఇస్రో చేసే చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రసారం చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి :

Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?

Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ

Updated Date - 2023-08-22T13:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising