ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha Train Accident: ఒడిశా విషాదంపై మోదీ తొలి స్పందన

ABN, First Publish Date - 2023-06-03T18:15:22+05:30

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన హోర రైలు దుర్ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రమాదంలో గాయపడి కటక్‌లోని చికిత్స పొందిన బాధితులను ఆయన శనివారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధితులను అన్నివిధాల వైద్యసాయం అందిస్తామని, ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కటక్: ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన (Train Accident) తనను ఎంతగానో కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రమాదంలో గాయపడి కటక్‌లోని చికిత్స పొందిన బాధితులను ఆయన శనివారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధితులను స్వయంగా కలుసుకున్నానని, వారికి అన్నివిధాల వైద్యసాయం అందించి ఆదుకుంటామని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని, ఏ ఒక్క కోణం వదలి పెట్టకుండా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఈ ఘటనకు కారణకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ యుద్ధపాత్రిపదికన పునరుద్ధరిస్తోందని తెలిపారు.

దీనికి ముందు, బాలాసోర్ జిల్లాలో రైలు ప్రమాద దుర్ఘటనా స్థలిని ప్రధాని సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయం

కాగా, బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత మూడేళ్లుగా ఒక్క రైలు ప్రమాద ఘటన కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. బాలాసోర్ ఘటన తనకు, తమ ప్రభుత్వానికి ఎంతో ఆవేదన కలిగించిందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నిర్దేశకత్వంలో రైల్వే మంత్రి స్యయంగా ప్రమాద స్థలిలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తు్న్నారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

Updated Date - 2023-06-03T18:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising